జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): భారతరత్న, రాజ్యాంగ పితామహులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు నగరంలోని కోర్ట్ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం వద్ద వేడుకలను ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు జిల్లా కాంగ్రెస్ ఎస్.సి.సెల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే డా.మేడిపల్లి సత్యం హాజరై సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, రాష్ట్ర ఆర్టిఏ మెంబర్ నవీన్, జిల్లా ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ లతో పాటు పలువురు ముఖ్యనేతలతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం నగరంలోని కోర్ట్ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డా.మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, దళిత సంఘాల నాయకులతో కలిసి పూల మాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించినారు. కార్యమానంతరం మేడిపల్లి సత్యం జయంతి కార్యక్రమానికి హాజరైన ప్రజలతో కలిసి సహఫంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే డా.మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశంలో కుల వివక్షకు, అంటరానితనానికి వ్యతిరేకంగా మరి ముఖ్యంగా మహిళల కోసం కార్మికుల కోసం అనేక రకాలుగా పోరాడినటువంటి గొప్ప మహనీయులు.
చిన్నతనంలో ఎన్నో వివక్షలను అసమానతలను ఎదుర్కొని ఒక్కొక్కటిగా వాటన్నింటినీ ఎదుర్కొంటూ లండన్ లో అమెరికాలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి ఆరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ దేశాలు కోట్లు ఆఫర్ చేసినప్పటికీ నా దేశానికి నా జాతికి సేవ చేయాలని చెప్పి తిరిగి భారతదేశం వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఇక్కడ ఉన్న అనగారిన వర్గాల, కార్మికుల, మహిళల హక్కుల కోసం, ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేసిన గొప్ప మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ముఖ్యంగా దళితులంతా దళితులు ఇతర వర్గాలు అంబేద్కర్ ఏ విధంగా ఉన్నత విద్యను అభ్యసించినారో ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ఈ దేశ అభ్యున్నతి కోసం పోరాడాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంబేద్కర్ అడుగుజాడల్లో వారి ఆలోచన విధానంతో సామాజిక న్యాయం, సమానత్వం దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమాలలో నాయకులు నాయకులు ఎండి తాజ్, మల్లికార్జున రాజేందర్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, మడుపుమోహన్, ముత్యం శంకర్ గౌడ్, వరాల నర్సింగం, ఆకుల నరసయ్య, పర్వత మల్లేశం, ఆకారపు భాస్కర్ రెడ్డి,వెన్న రాజమల్లయ్య,గడ్డం విలాస్ రెడ్డి, విక్రమ్ సికిందర్, పడాల అజయ్ గౌడ్, అన్నమనేని నరసింహారావు, బొబ్బిలి విక్టర్,భాకరాప్ శివయ్య, కల్వల రామచందర్ , దిండిగాల మధు, అహమ్మద్ అలీ, కామ్ రెడ్డి రామ్ రెడ్డి ,బత్తిని చంద్రయ్య గౌడ్, వీర దేవేందర్, సరిల్లరతన్ రాజు, ముక్క భాస్కర్, లైక్, కరీం, నాగుల సతీష్, ఊకంటి రవీందర్ రెడ్డి, కోడూరు రవీందర్ గౌడ్, జీడి రమేష్, అమీర్, తోట అంజయ్య, వసీం, నూనె గోపాల్ రెడ్డి, అస్తపురం తిరుమల, చింతల్ కిషన్, జొన్నల రమేష్, కాంపల్లి కీర్తి కుమార్, నవీన్ యాదవ్, పిట్టల రవి, ఇమ్రాన్, కిషన్ రెడ్డి, సుధాకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.






