పదవి విరమణ అనంతరం సుఖశాంతులతో జీవించాలి
ఐఎన్టీయూసీ నేతలు క్రాంతి కుమార్ కోటేశ్వరరావు
సత్తుపల్లి. జూన్ 30,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణం సింగరేణి జే.వి.ఆర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో హెడ్ ఓవర్ మెన్ గా విధులు నిర్వహిస్తూ ఈరోజు పదవి విరమణ పొందుతున్న గిద్దలూరు నాగేశ్వరరావు దంపతులకు మంగళవారం ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ సీతారామరాజు ఆధ్వర్యంలో ఐ.ఎన్.టి.యు.సి నేతలు పూలమాలలు , శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి తీగల క్రాంతికుమార్ , ఏరియా ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడారు. సింగరేణి సంస్థలో సుదీర్ఘంగా 36 సం:రాలు సర్వీస్ పూర్తి చేసుకుని పదవి విరమణ చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
నాగేశ్వరరావు హెడ్ ఓవర్ మెన్ సింగరేణి సంస్థలో వివిధ ఏరియాలో విధులు నిర్వహించి ఉత్తమ ఉద్యోగిగా అవార్డులు అందుకున్నారని తెలియజేశారు. ఉద్యోగులకు యాజమాన్యానికి వారధిగా ఉంటూ సంస్థ అభ్యున్నతికి తోడ్పడ్డారని తెలియజేశారు. రక్షణ క్రమశిక్షణతో విధులు నిర్వహించి అధికారులు , ఉద్యోగుల వద్ద మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని కొనియాడారు. వారి రిటైర్మెంట్ జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో గడపాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ బ్రాంచ్ సెక్రటరీలు నాగ ప్రకాష్ , మురళి , అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ శ్రీధర్ , నాయకులు జగదీష్ మరాటి , రఫీ , సురేష్ , ప్రసన్న , పొట్టి కిరణ్ ,రషీద్ , జనగాం శీను సందీప్ శ్రీనివాసరావు గౌస్ అశోక్ లింగమూర్తి గాలి వెంకటేశ్వర్లు రాము అశోక్ రాజేందర్ శ్రీధర్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






