మొక్కలు నాటిన సహకార సంఘ అధ్యక్షులు: నర్సింహా రెడ్డి
30-06-2026 12:18 PM
నిజాంసాగర్ జూన్ 30(విజయక్రాంతి): సహకార సంఘ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సహకార సంఘ పరిధిలో గల ఫంక్షన్ హాల్ వద్ద సహకార సంఘ అధ్యక్షులు కయ్యం నరసింహారెడ్డి మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణ భాగంగా మొక్కలు నాటినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ సీఈవో సంగమేశ్వర్ గౌడ్, డైరెక్టర్ విట్టల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






