30 June, 2026 | 12:33 PM

ఇయ్యాల్నే రైతు భరోసా... మోతమోగనున్న రైతుల సెల్‌ఫోన్లు

30-06-2026 11:42 AM

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) తెలిపారు. మంగళవారం ఖరీఫ్ సీజన్ రైతు భరోసా పంపిణీ చేస్తామని ప్రకటించారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. రైతు భరోసాతో రైతుల్లో విశ్వాసం పెంచుతున్నామని తెలిపారు. ఈ వానాకాలం సీజన్‌లో మొత్తం 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు(Rythu Bharosa funds) దశలవారీగా జమ కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది రోజుల్లో రైతు ఖాతాల్లోకి 9 వేల కొట్ల పంపిణీ చేయనుంది. 

వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభను( Rythu Ashirvada Sabha) రద్దు చేసన ప్రభుత్వం హైదరాబాద్ కు మార్చింది. రైతు భరోసా పంపిణీ సదస్సుగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నేటి నుంచి 10 రోజుల్లో రైతుభరోసా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం 30-06-2026 సాయంత్రం 4 గంటలకు  హైదరాబాద్ శిల్పకళా వేదికగా ప్రారంభం కానుంది. ఇయాలనుంచి రైతలు సెల్‌ఫోన్లు మోత మోగనున్నాయి.

నేడు 2 ఎకరాల వరకు రైతు భరోసా

మొదటి రోజే రూ.2,482.02 కోట్లు

41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ

ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతులకు రూ.878.94 కోట్లు

ఎకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతులకు రూ.1,603.08 కోట్లు