ప్రతి ఒక్కరు ఓటు నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి
కోఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్...
బాన్సువాడ,(విజయ క్రాంతి): ప్రతి ఒక్కరూ ఓటు నమోదును తప్పనిసరిగా చేసుకోవాలని కోఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ సూచించారు.కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున స్పెషల్ ఇంటెన్సివ్ ఎన్యూమ్యురేషన్ డోర్ టు డోర్ కార్యక్రమం లో బిఎల్ఓ వాణితో కలిసి కో ఆప్షన్ సభ్యులు గౌస్,కాసుల రోహిత్ ప్రతి ఇంటి కి వెళ్ళి స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమం కి సంబంధించిన ఫారం,ఫోటో, డాక్యుమెంట్స్ లపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటును నమోదు చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డిలు పర్యవేక్షిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.






