18 July, 2026 | 1:34 AM

ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి

18-07-2026 01:25 AM

మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు ఇమ్మడి వాణిశ్రీ

ఎర్రుపాలెం జూలై 17 (విజయక్రాంతి):  ఎల్ - నినో వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు ఇమ్మడి వాణిశ్రీ సూచించారు. మండల పరిధిలో మామూనూరు గ్రామ పరిధిలో ప్రసు ్తత వర్షాబావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి అని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు పెసర, మినుములు, అలసంద  వంటి తక్కువ నీటి వినియోగం ఉన్నటువంటి పంటలు, తేలిక మరియు మధ్యస్త నేలల్లో కంది మరియు తక్కువ కాలపరిమితి గల కూరగాయలు సా గు చేసుకోవాలి అని తెలియజేసారు.

అదే విధంగా రైతులు వ్యవసాయ పంట కుంట లు ఫార్మ్ పాండ్  ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుంది, వర్షపు నీటిని ఒడిసి పట్టి నిల్వ చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్లో సాగుకు వినియోగించుకోవచ్చు అని తెలిపారు. వ్యవసాయ పంట కుంట ఫార్మ్ పాండ్  నిర్మాణానికి చిన్న, సన్నకారు రైతు లు అర్హులు మరియు 100 శాతం సబ్సిడీతో వి బి జి రామ్ జి    కేంద్ర ప్రభుత్వ కింద రై తులకు నిర్మాణం చేసి ఇస్తారు. ఫార్మ్ పాండ్ నిర్మాణం కొరకు ఆసక్తి వున్నవారు సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి సంప్రదించాలని కోరారు .

అలాగే మండలంలో ఎరువుల దుకాణలను తనిఖీ చేసి ఎరువుల స్టాక్ వివరాలు, ఈ- పాస్ మిషన్ తనిఖీ, బిల్ బుక్స్ మరియు స్టాక్ రిజిస్టర్లు తనిఖీ చేసి డీలర్లకు స్టాక్ రిజిస్టర్ల నిర్వహణలో పలు సూచనలు చేసారు. పత్తి పంట పరిశీలనలో భాగంగా రైతులకు రసం పీల్చే పురుగుల నివారణకు తీసుకోవలసిన యా జమాన్య పద్ధతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ పెద్ద బాబు సాహెబ్, వ్యవసాయ విస్తరణ అధికారులు కత్తి కృష్ణ కుమారి, ఏడుకొండల బాలకృష్ణ, రైతులు పాల్గొన్నారు.