ఎస్‌ఎస్‌ఆర్‌లో క్యాంపస్ సెలక్షన్స్
పాల్గొన్న 200 మంది విద్యార్థులు
నిజామాబాద్, జులై17 (విజయక్రాంతి): ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ, పీజీ కళాశాల(అటానమస్)లో శుక్రవారం విజయవంతంగా క్యాంప స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థలైన ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్, హెచ్‌ఆర్‌హెచ్ నెక్స్, లాజిస్టి క్స్ స్కిల్ సెక్టార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఎస్‌సీ), ఒనిక్స్ ఎడ్యూటెక్ సంస్థల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు సుమారు 200 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకొన్నారు. వారిలో ప్రతిభ కనబర్చిన 65 మంది విద్యార్థులు వివిద సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక కావ డం విశేషం. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ, పీజీ కళాశాల(అటానమస్)చైర్మన్ డాక్ట ర్ ఎం.మరయ్యగౌడ్ ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
అలాగే విద్యార్థులకు విలువైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కళాశాలను సందర్శించిన ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్, హెచ్‌ఆర్‌హెచ్ నెక్ట్స్, లాజిస్టిక్స్ స్కిల్ సెక్టార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఎస్ సీ), ఒనిక్స్ ఎడ్యూటెక్ సంస్థల హెచ్‌ఆర్ ప్రతినిధులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతు తెలిపా రు. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, అ ధ్యాపక బృందం, ట్రైనింగ్ అండ్ ప్లెస్‌మెంట్ సెల్ ఈ క్యాంపస్ నియామక కార్యక్రమం విజయవంతంగా ముగియడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో కూడా ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిం చేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.






