ఆలిండియాలో అగ్రస్థానంలో ‘శ్రీచైతన్య’
నీట్ ఫలితాలలో కొనసాగిన ఆధిపత్యం
హైదరాబాద్, జులై 17(విజయక్రాంతి): నేడు విడుదలైన నీట్ 2026 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి శ్రీచైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్, మూ డో ర్యాంక్, తొమ్మిదవ ర్యాంక్‌తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రా లు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీచైతన్యయే సాధించి టాప్ ర్యాంకుల్లోనూ, టోటల్ ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంతో దూసుకెళ్లింది.
ఆలిండియా ఓపెన్ కేటగిరీ 1వ ర్యాంక్ ఆర్యన్ గుప్త(హాల్ టికెట్ నెం.260410023990), 3వ ర్యాంక్ ఉపలక్ష్య గోయెల్(హాల్ టికెట్ నెం.26041 0040821), 9వ ర్యాంక్ గౌరవ్ సింగ్(హాల్ టికెట్ నెం.260410079810)తో పాటు ఆల్ ఇండియా 5వ ర్యాంక్ బుర సాయి చరణ్(హాల్ టికెట్ నెం.260410265143), 6వ ర్యాంక్ కె.హనీష్(హాల్ టికెట్ నెం.26041027 6126), సాధించిన విద్యార్థులు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కావడం గమనార్హం.
ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 10లోపు 3 ర్యాంకులు, 20 లోపు 6 ర్యాం కులు, 50 లోపు12 ర్యాంకులు, 100లోపు 18 ర్యాంకులు, వెయ్యిలోపు 84 ర్యాంకులు, కేటగిరి ర్యాంకుల్లో 10లోపు 8 ర్యాంకులు, 100లోపు 67 ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులవే. ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యా సం స్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ మాట్లాడుతూ నాణ్యమైన శిక్షనను అందిస్తూ అనిత రసా ధ్యమైన ప్రోగ్రాములు, మైక్రోషెడ్యూల్స్, ఇం టర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్స్, దేశంలోనే టాప్ ఫ్యాకల్టీ కారణంగానే ఇంత టి ఫ లితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఇం తటి ఘన విజయం సాధించిన విద్యార్థుల ను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక అ ధ్యాపకేతర సిబ్బందిని ఆమె అభినందించారు.






