పారితోషకం వద్దు.. కనీస వేతనం ఇవ్వాలి
24-03-2026 12:05 AM
ఆశా కార్యకర్తల ధర్నా
మహబూబాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): పారితోషకాలు వద్దని, నెలకు కనీస వేతనం 18 వేలు చెల్లించాలని, పిఎఫ్, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజల ఆరోగ్య అవసరాల్లో కీలకపాత్ర వహిస్తూ, వైద్య ఆరోగ్యశాఖకు అనుసంధానంగా పనిచేస్తున్న ఆశా కార్యకర్తల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేయాలని, హామీల అమలు కోసం సంఘటిత ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.




