20 June, 2026 | 10:47 PM

బ్లూ బెల్స్ హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

20-06-2026 09:47 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్‌లోని  బ్లూ బెల్స్ హైస్కూల్లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, రోడ్డు భద్రత కార్యక్రమం  నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ఘన్ షామ్ ఓజ  అవినీతి నిరోధక, రోడ్డు భద్రత డైరెక్టర్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలను పాటించడం, హెల్మెట్ ధరించడం, జీబ్రా క్రాసింగ్‌ను ఉపయోగించడం, వాహనాలు నడిపేటప్పుడు సెల్‌ఫోన్ వినియోగాన్ని నివారించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 

ఉపాధ్యాయులు వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు. అలాగే పాఠశాల కరెస్పాండెంట్ మరియు చైర్మన్ జంగా సునీత మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు ఏకాగ్రత, క్రమశిక్షణను అభివృద్ధి చేస్తుందని అన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగా మరియు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించుకున్నారు.