అల్మాస్‌గూడ పార్కు స్థలం కబ్జా
హైడ్రాకు -యువమోర్చా నేత శూరకర్ణరెడ్డి పిర్యాదు
బడంగ్‌పేట్, మే 2 (విజయక్రాంతి): బడంగ్పేట్ సర్కిల్ నాదర్‌గుల్ డివిజన్ 57 అల్మాస్ గూడలో ప్రభుత్వ పార్కు స్థలం కబ్జాకు గురైందంటూ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామిడి శూరకర్ణ రెడ్డి ఆరోపిస్తూ.. శనివారం హైడ్రా అధికారులను కలిసి కబ్జాపై చర్యలు తీసుకోవాలని కోరు తూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా శూరకర్ణ రెడ్డి మాట్లా డుతూ.. జిహెచ్‌ఎంసి శంషాబాద్ జోన్ బడంగ్ పేట్ సర్కిల్ నాదర్ గుల్ డివిజన్ పరిధిలోని అల్మాస్ గూడ గ్రామ సర్వే నెంబర్లు 30, 31, 32, 33, 34, 35, 36లలో రామిడి కళావతి కాలనీ, బిఎస్‌ఆర్ కాలనీలకు కేటాయించిన పార్కు స్థలాన్ని కొంద రు వ్యక్తులు ఆక్రమించినట్లు పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా రాత్రికి రాత్రే సదరు పార్కు స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి కబ్జాకు పాల్పడ్డారని శూరకర్ణ రెడ్డి ఆరోపించారు. విలువైన ప్రభుత్వ భూమిని ప్రజల సౌకర్యార్థం కేటాయించిన పార్కు స్థలాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ్రఈ కార్యక్రమంలో పలువురు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






