4 May, 2026 | 8:40 AM

రాష్ట్రాభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకం

03-05-2026 12:00 AM

కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

ఎల్బీనగర్, మే 2 (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఆర్యవైశ్యుల భాగస్వామ్యం కీలకమని... కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా  అమరవాది లక్ష్మీనారా యణ గుప్తా శనివారం హస్తినాపురంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమం లో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీలు టీజీ వెంకటేశ్, గిరీశ్ సంఘీతోపాటు వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అం డగా ఉంటుందన్నారు. ఆర్యవైశ్యుల్లోనూ అనేక మంది పేదలున్నారని... అలాంటి వారి అభ్యున్నతికి ప్రత్యేక దృష్టి  సారిస్తామని హామీ ఇచ్చారు. 

కార్యక్రమంలో అమరవాది లక్ష్మీనారాయణ, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, ఎమ్మెల్యేలు ధనాపాల్ సూర్యనారాయణ గుప్తా, వీర్లపల్లి శంకర్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, పీసీసీ ప్రతినిధి ఉప్పల శ్రీనివాస్ గుప్తా, నాయకులు  ఉప్పల వెంకటేశ్, ఇల్లూరు లక్ష్మయ్య,  దేవకి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు వి. కనకరాజు పాల్గొన్నారు.