మరో వైట్‌వాష్
- చివరి టీ20లోనూ భారత్ ఓటమి
- సెంచరీతో రెచ్చిపోయిన బట్లర్
- 4 ఇంగ్లాండ్ సిరీస్ కైవసం
- భారత్ నెం.1 ర్యాంక్ గల్లంతు
ఇంగ్లాండ్ టూర్‌లో భారత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న టీమిండియా ఆఖరి టీ20లోనూ ఓడిపోయింది. బౌలర్లు, బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ... మరో వైట్‌వాష్ పరాభవాన్ని చవిచూసింది. ఫలి తంగా సిరీస్‌ను 4-- స్వీప్ చేసిన ఇం గ్లాండ్ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి అగ్రస్థానాన్ని సైతం లాగేసుకుంది.
సౌతాంప్టన్, జూలై 11 : ఈ మ్యాచ్‌లో ఊహించినట్టుగానే భారత తుది జట్టులో మార్పులు జరిగాయి. వైభవ్ సూర్యవంశీ, వాషింగ్టన్ సుందర్‌లను తప్పించి సంజూ శాంసన్, సూర్యాన్షు షెగ్దేలకు అవకాశం కల్పించారు. వరుసగా ఏడోసారి టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకు న్నాడు. ఫిల్ సాల్ట్ (6) త్వరగానే ఔటైనా బట్లర్, బ్రూక్ మాత్రం రెచ్చిపోయారు. బట్ల ర్ నిదానంగా ఆడినా.. హ్యారీ బ్రూక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత బౌలర్లపై విరుచు కుపడ్డాడు.
ఆ తర్వాత బట్లర్ కూడా బ్యాట్ ఝులిపించడంతో పరుగుల వరద పారింది. 5.3 ఓవర్లలో 50 పరుగులు పూర్తి చేసుకున్న ఇంగ్లండ్.. మరో 4 ఓవర్ల వ్యవధిలోనే 100 పరుగుల మార్క్ అందుకుంది. 19 బం తుల్లో బ్రూక్ హాఫ్ సెంచరీ సాధించగా.. జోస్ బట్లర్ 34 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ.. ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారత బౌలర్లపై విరుచుకుపడింది. 51 బంతుల్లో బట్లర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం అనంతరం అక్షర్ పటేల్ బౌలింగ్ అతను ఇ చ్చిన క్యాచ్‌ను సూర్యాన్ష్ షెడ్గే నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను మరిన్ని బౌండరీలు రాబట్టాడు.
వీరిద్దరూ రెండో వికెట్ కు 233 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో ఇది భారీ రికార్డు. అటు బ్రూక్ కూడా మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. ఫలితంగా భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బట్లర్ 64 బం తుల్లో 131 పరుగులు చేశాడు. బట్లర్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అటు హ్యారీ బ్రూక్ కేవలం 45 బంతుల్లోనే 96 రన్స్ చేయ గా అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 8 సిక్సర్లున్నాయి.
అర్ష్దీప్ సింగ్ మినహా మిగిలిన బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ 60+ రన్స్ సమర్పించుకోగా.. శివమ్ దూబే ఒకే ఓవర్లో 22 పరుగులిచ్చుకున్నాడు.దీంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 257 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియాపై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో శివమ్ దూబె 2 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ పడగొట్టారు.
తర్వా త ఛేజింగ్‌లో టీమిండి యా చేతులెత్తేసింది. సం జూ శాంసన్ (27), అభిషేక్ శర్మ (3) పరుగులకే వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ దూ కుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. శ్రేయాస్ అయ్య ర్(28), శివమ్ దూబే(14) నిరాశపరిచారు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. చివరికి భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కురన్ 3 , ఆదిల్ రషీద్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ ఓటమితో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానం చేజార్చుకోగా.. ఇంగ్లాండ్ టాప్ ప్లేస్‌కు దూసుకెళ్ళింది.
స్కోర్ బోర్డు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : 257/3 ( బట్లర్ 131, బ్రూక్ 95 నాటౌట్, విల్ జాక్స్ 7 నాటౌట్ ; దూబే 2/22, ప్రసిద్ధ కృష్ణ 1/38)
భారత్ ఇన్నింగ్స్ : 201/8 (ఇషాన్ కిషన్ 58, తిలక్ వర్మ 53, శ్రేయాస్ అయ్యర్ 28 ; సామ్ కురన్ 3/36, ఆదిల్ రషీద్ 2/24 )






