12 July, 2026 | 2:25 AM

సీఎం లక్ష్మిప్రణతి పాత్రలో..

12-07-2026 01:04 AM

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్లూయెన్సర్ యామినీ ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి హీరోయిన్ సెంట్రిక్ కథతో ‘క్వీన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇందులో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విల న్లుగా నటిస్తుండగా, సాయికుమార్ హీరోయిన్ తండ్రి పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక కీలక అప్‌డేట్‌ను పంచుకున్నారు మేకర్స్.

ప్రముఖ నటి రమ్యకృష్ణ తమ టీమ్‌లో జాన్ అవుతున్నారన్న విషయాన్ని ప్రకటించారు. ఈ చిత్రంలో ఆమె ఏపీ సీఎం లక్ష్మిప్రణతి పాత్రలో అలరించనున్నారని వెల్లడించారు. దర్శకుడు రతన్ రిషి ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా, రియల్ క్యారెక్టర్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఫిక్షనల్ స్టోరీతో రూపొందిస్తున్నారు.

2006--2010 మధ్య కాలంలో సాగే కథతో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుత సమాజంతో ముడిపడి ఉన్న ఒక ప్రేమకథను ఈ చిత్రంలో చూడబోతున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంగీతం: భరత్ ఎం; డీవోపీ: బాల ఎన్ సరస్వతి; ఎడిటింగ్: ఆర్‌ఎం విశ్వనాథ్ కుచనాపల్లి; ఆర్ట్: భార్గవ నౌండ్ల.