12 July, 2026 | 1:11 AM

రైతు డిస్కంకు ఈఆర్‌సీ పచ్చజెండా!

12-07-2026 12:00 AM
  1. లైసెన్స్ ఉత్తర్వులు జారీ చేసిన విద్యుత్తు నియంత్రణ మండలి
  2. పలు పథకాల వినియోగదారులందరూ రైతు డిస్కం పరిధిలోకి

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో మూడో డిస్కం (రైతు డిస్కం)కు మార్గం సుగమమయ్యింది. తెలంగాణ రైతు పవర్ డిస్కం కార్పొరేషన్ లి. (టీజీఆర్‌పీడీసీఎల్)కు లైసెన్స్ మంజూరు చేస్తూ.. రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఛైర్మన్ డాక్టర్ జస్టిస్ దేవరాజు నాగార్జున, సభ్యులు (టెక్నికల్) రఘు కంచర్ల, చెరుకూరి శ్రీనివాసరావు (ఫైనాన్స్)లు ఉత్తర్వులు జారీచేశారు.

ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న రెండు డిస్కంలు ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌కు తోడుగా మూడో డిస్కంను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్ర భుత్వం నిశ్చయించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మూడో డిస్కం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ యాజమాన్యాలతోపాటు మూడో డిస్కం యాజమా న్యంకూడా రాష్ట్ర విద్యుత్తు నియంత్రిణ మం డలి (ఈఆర్‌సీ)లో పిటిషన్లు దాఖలు పరిచారు.

దీనికి సంబంధించి ఈఆర్‌సీ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రజాభి ప్రాయ సేకరణ కూడా చేసింది. పలువురు నిపుణులు, సంస్థ లు, ఎన్‌జీవోల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీక రించి, అధికారులతో అభ్యంతరాలపై లోతుగా విచారించింది. చివరకు శుక్రవారంనాడు మూ డో డిస్కం (టీజీఆర్‌పీడీసీఎల్)కు లైసెన్సు జా రీ చేస్తూ ఈఆర్‌సీ ఉత్తర్వులు జారీచేసింది.

విద్యుత్తు నియంత్రణ మండలి జారీచేసిన ఆదేశాల ప్రకారం.. మూడో డిస్కం పరిధిలోకి వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులతోపాటు.. ఎత్తిపోతల పథకాల వినియో గదా రులు (లిఫ్ట్ ఇరిగేషన్), బిషన్ భగీరథ, సమగ్ర రక్షిత మంచినీటి పథకం వినియోగదారులు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లు అం డ్ సీవరేజ్ బోర్డ్‌తోపాటు ప్రత్యేక డిస్ట్రిబ్యూష న్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న మున్పిల్ వాటర్ సప్టు కనెక్షన్స్ వస్తాయని స్పష్టంగా పేర్కొంది. పలు నిబంధనలు పేర్కొంటూ.. వాటిని అమలు చే యాలని, అలాగే.. ఉత్తర్వులు జారీచేసిన నా లుగు నెలల లోపు ఈ డిస్కం అమలులోకి వ స్తుందని కూడా ఈఆర్‌సీ స్పష్టంగా పేర్కొంది.