14 March, 2026 | 7:21 AM

ఆల్ ది బెస్ట్..!

14-03-2026 12:44 AM
  1. నేటి నుంచి పది పరీక్షలు..

జిల్లాలో 68 పరీక్షా కేంద్రాల ఏర్పాటు

హాజరుకానున్న 11,247 మంది విద్యార్థులు

100 మంది  ప్రైవేట్ విద్యార్థులు

పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్లు

మెదక్, మార్చి 13 (విజయ క్రాంతి) :జి ల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్ష లను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు ఏ ప్రిల్ 16న ముగియనున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 11,247 మంది విద్యార్థులు ‘పది’ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 5,577 మంది బాలురు, 5,670 మంది బాలికలు ఉన్నారు. 100 మంది ప్రైవేట్గా పరీక్షలు రాస్తున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 68 పరీక్షా కేం ద్రాలను ఏర్పాటు చేశారు.

ఒక్కో కేంద్రానికి ఒకరు చొప్పున 68 మందిని చీఫ్ సూపరింటెండెంట్గా, 68 మందిని డిపార్టుమెంట్ అధికారులను,పర్యవేక్షణకు ముగ్గురు ఫ్ల యింగ్ స్క్వాడ్లు, రూట్ ఆఫీసర్లు10 మంది పర్యవేక్షణలో జరిగే పరీక్షలకు 630 మందిని ఇన్విజిలేటర్లను నియమించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను అరగంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి అరగంట ముందే చేరు కొని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలులో ఉంటుంది.

సీసీ కెమెరాల నిఘాలో పరీక్షా కేంద్రాలు... 

సీసీ కెమెరాల నిఘాలో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. డ్యుయల్ డెస్క్లు, తాగునీరు, గాలి వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఉం డేలా చర్యలు తీసుకున్నారు. మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు, అదన పు డిపార్టుమెంట్ అధికారుల పర్యవేక్షణతో పాటు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు.

కలెక్టర్ అధ్యక్షతన పదో తరగతి పరీక్షల నిర్వహణపై పలుమార్లు సమావేశాన్ని నిర్వహించి విద్యా, రెవెన్యూ, పోలీసు, వైద్యశాఖ అధికారులకు మార్గదర్శనం చేయడంతో ఆయాశాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశాయి. జిల్లా విద్యాశాఖ వ్బుసైట్ నుంచి విద్యార్థి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యా ర్థి పుట్టిన తేదీ, ఆధార్కార్డు నెంబర్ నమోదు చేసి హాల్ టికెట్ వస్తుందని, ఇందుకు సం బంధించి డీఈవో కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశామని డీఈవో విజయ తెలిపారు. విద్యార్థులు ఏమైనా సమస్యలుంటే డెస్క్ను సంప్రదించాలని సూ చించారు.

ఈ యేడు వంద శాతం ఫలితాలను సాధించే విధంగా పక్క ముందస్తు ప్ర ణాళికతో విద్యాబోధన చేయడంతోపాటు నిపుణులతో సబ్జెక్టులవారీగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశామని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి సెల్ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించబోమని అన్నారు. హాల్ టికెట్, ప్యాడ్, పెన్, పెన్సిల్, స్కేల్, షార్ప్నర్, ఎరేజర్, జామెట్రీ పరికరాలను మాత్రమే తీసుకవెళ్లవచ్చని చెప్పారు.

పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పరీక్షల్లో కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే తీసుకువచ్చి ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు తల్లిదండ్రులు సహకరించాలని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని డీఈవో విజయ సూచించారు.

 పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు.. 

మెదక్ జిల్లాలో జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద మార్చి14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు సెక్షన్ 163 (బీఎన్‌ఎస్‌ఎస్) అమలులో వుంటుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. పదో తరగతి పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి వుండరాదన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించవద్దని తెలిపారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు మూసివేయాలని సూచించారు.

పరీక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.