అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
ఘట్‌కేసర్, జూలై 14 (విజయక్రాంతి) : పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం రాజీవ్ గృహకల్ప, అన్నోజిగూడ అయ్యప్ప టెంపుల్ ల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు సర్ ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.పర్యటన సందర్భంగా గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, పెన్షన్లు, రేషన్, గృహాలు తదితర ప్రజాసమస్యలను తెలుసుకుని, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కర్రె రాజేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల కృష్ణారెడ్డి, పోచారం డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ మెట్టు గణేష్ యాదవ్, మాజీ ఉపాధ్యక్షులు బద్రి హేమంత్, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఓబీసీ కన్వీనర్ మాజీ చంద్రకాంత్, 2వ వార్డు అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ నర్రి శ్రీశైలం, మాజీ మహిళ అధ్యక్షురాలు ఎర్ర మాధవి, బద్దం నరసింహారెడ్డి, బండ్లగూడ నాగేష్ గౌడ్, భోజరెడ్డి, కొంతం శంకర్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, నరేష్ విజయ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, గంధమల్ల రమేష్ , దేవేందర్ ముదిరాజ్, గంధ మల్ల రమేష్ గౌడ్, జాఫర్ హుస్సేన్, నాగరాజుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.






