టెన్త్ ఫలితాల్లో అల్ఫోర్స్ విజయ దుందుభి
ముకరంపుర, ఏప్రిల్ 29,(విజయక్రాంతి):విద్యార్థులకు పటిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తూ వారిని సంచలనాత్మక విజయాలను నమోదు చేసే విధంగా ప్రోత్సాహం అందిస్తూ వారి కలలను సహకారం చేస్తున్నామని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించడం పట్ల ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి, అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బుధవారం ప్రకటించినటువంటి పదవ తరగతి ఫలితాల్లోఅల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించడం అల్ఫోర్స్ విద్యా విధానానికి ఒక గొప్ప ప్రతీక అని గుర్తు చేశారు.
అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఆర్.సాత్విక్ 589 మార్కులతో అగ్రస్థానంలో నిలిచాడని, ఓ.ఆద్య, టి.రాజు, బి.అక్షిత్ రెడ్డి, 588 మార్కులు సాధించారని, 1274 మంది విద్యార్థులకు 1026 విద్యార్థులు 500 మార్కులు పైన సాధించడం చాలా స్ఫూర్తిదాయకమని చెప్పారు. 48 మంది విద్యార్థులు 580 మార్కులు పైగా సాధించారని, 334 మంది విద్యార్థులు 560 మార్కులు పైగా సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.






