సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలి
02-05-2026 05:20 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ డివిజన్లోని గిరిజన గ్రామాల ప్రజలు సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులు సూచనలు చేశారు. శనివారం డివిజన్ పరిధిలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో వ్యవసాయ శాఖ అధికారి రాథోడ్ గణేష్ తదితరులు మాట్లాడుతూ... వచ్చే ఖరీఫ్ సాగుకు ముందు ఇంటి వద్ద ఉన్న పశువుల పేడను సాగు భూముల్లో వేసుకుని దుక్కి దున్నుకోవాలన్నారు. పశువుల పేడను సాగు భూముల్లో వేసుకుంటే భూసారం పెరుగుతుందన్నారు. ఖరీఫ్ పంటల సాగుకు ముందు సాగు చేసే పంటల పై నిర్ణయించుకొని అధికారుల సూచనల ప్రకారంగా విత్తనాలు కొనుగోలు చేయడంతో పాటు బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు.






