2 May, 2026 | 6:53 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

ఖానాపూర్ మండలంలో ఎక్సైజ్ అధికారుల దాడులు

02-05-2026 05:22 PM

నల్ల బెల్లం, నాటు సారా స్వాధీనం,

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో శనివారం ఉదయం ఎక్సైజ్ అధికారులు భారీగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున నల్ల బెల్లం, నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ రంగస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. దాడిలో 10 లీటర్ల నాటుసారా, 1900 లీటర్ల బెల్లం పానకం, 290 కిలోల నల్ల బెల్లం, 30 కిలోల అలం, స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు.