17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఏసీబీకి చిక్కిన ఏఈ

16-04-2026 12:50 AM

బిల్లుల క్లియర్‌కు రూ.50 వేలు డిమాండ్

హుజురాబాద్, ఏప్రిల్15(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా పనిచేస్తున్న నుసుం సుధాకర్ రెడ్డి బుధవారం ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డా రు. అందిన వివరాల మేరకు.. కాంట్రాక్టర్ ఒకరు హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో తుపా ను నీటి కాలువల నిర్మాణ పనులను పూర్తి చేశారు.

ఫైనల్ బిల్లును ప్రాసె స్ చేయడం, మెజర్మెంట్ బుక్‌లో నమో దు చేయడం కోసం సుధాకర్‌రెడ్డి రూ. 50,000 లంచం ఇవ్వాలని ఆ కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారు లు పక్కా ప్రణాళికతో హుజూరాబాద్‌లోని ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద కాంట్రాక్టర్ నుంచి లం చం తీసుకుంటున్న సమయంలో సుధాకర్ రెడ్డి ని పట్టుకున్నారు.నిందితుడిని కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.