6 May, 2026 | 5:35 PM

Breaking News

సామల వారి వివాహ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ హాజరు   •   కోనరావుపేట పీఏసీఎస్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి… సీపీఐ ధర్నా   •   పంట సాగుపై రైతులకు అవగాహన   •   కోనరావుపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు –అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగండ్ల దీపక్ చౌదరి   •   పిఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఏగుల నరసింహులు,వైస్ చైర్మన్   •   కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నీడ కల్పించాలని ఇందిరమ్మ పథకం   •   రైతుల సేవకు పున:రంకితమవుతా   •   రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి   •  

కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలి

27-02-2026 03:19 PM

లక్షేట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో బై ఎలక్షన్లు పెట్టాలని లంబాడి రాష్ట్ర జేఏసీ ఉపాధ్యక్షులు రాజు నాయక్, జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం లక్సేట్టిపేట విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన బోడ రాజు నాయక్ కౌన్సిలర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

లంబాడా జాతిని కించ పరిచి క్రైస్తవ మతాన్ని స్వీకరించి మొన్న జరిగిన ఎన్నికలలో లంబాడి కుల సర్టిఫికెట్ ను పెట్టుకొని గెలవడం సరికాదన్నారు. లంబాడ జాతిని కించపరచకుండా తమ మనోభావాలు దెబ్బతీయకుండా క్రైస్తవ మతం నుంచి లంబాడా మతంలో కొనసాగాలని, ఇది ఏడవ వార్డు నుంచి కౌన్సిలర్ గా గెలుపొందిన బోడ రాజు నాయక్  ఆలోచించుకోవాలన్నారు. ఈ విషయంపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ కు  ఫిర్యాదు చేశామని తెలిపారు.

సంబంధిత అధికారులు, ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి ఏడవ వార్డు కౌన్సిలర్ బోడరాజు నాయక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు ఇంథల్ రాథోడ్, మాజీ కౌన్సిలర్ సురేష్ నాయక్, లంబాడి జెఎసి నాయకులు లకవత్ రవీందర్ నాయక్, తిరుపతి నాయక్, శ్రీనివాస్ నాయక్, ఈశ్వర్ నాయక్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.