కోనరావుపేట పీఏసీఎస్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకారం
06-05-2026 05:33 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన పాలకవర్గం హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బుధవారం బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా కోనరావుపేట చైర్మన్ బండ నర్సయ్య యాదవ్, కొలనూర్ చైర్మన్ రామ్మోహన్ రావు లు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
రైతుల అవసరాలకు తక్షణ స్పందన అందిస్తూ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం నూతన చైర్మన్లు, వైస్ చైర్మన్లు మరియు పాలకవర్గ సభ్యులను సిబ్బంది శాలువాలతో సన్మానించారు.






