2 July, 2026 | 12:24 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి… సీపీఐ ధర్నా

06-05-2026 05:31 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతను నివారించి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కమటం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డీజిల్ లేక రైతులు ట్రాక్టర్లు నడపలేక పంటల పనులు దెబ్బతింటున్నాయని, రవాణా వ్యవస్థ కూడా ప్రభావితమవుతోందని తెలిపారు.

గ్యాస్ కొరతతో మధ్యతరగతి, పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే కొంతమంది దళారులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. పెట్రోల్ కోసం టూ వీలర్ దారులు గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. అధికారులు కొరత లేదని చెబుతున్నప్పటికీ, ప్రాక్టికల్‌గా సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. గతంలో యుద్ధం పేరుతో కొరత ఉందని చెప్పి, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతుండటంపై ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి సరఫరాను మెరుగుపరచి ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.