రైతుల సేవకు పున:రంకితమవుతా
ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించిన పిఐసి చైర్మన్, పాలకవర్గo
మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని,(విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పదవి అవకాశం ఉన్నంత వరకు రైతుల సేవకు పున:రంకితం అవుతానని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. బుధవారం సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ కొత్త శ్రీనివాస్ డైరెక్టర్లతో కలిసి పర్సన్ ఇంచార్జిగా బాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘ పర్సన్ ఇంచార్జి కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ మళ్లీ వచ్చిన పదవి అవకాశంతో రైతుల సేవే పరమావధిగా పని చేస్తామని స్పష్టం చేశారు.
అయితే గతంలోనే సింగిల్ విండో పాలకవర్గాల గడువు తేది14.02.2025తో ముగిసి పోయిన అనంతరం 24.02.2025 న రాష్ట్ర ప్రభుత్వం పాలకవర్గాల గడువును 6 నెలలు పొడిగించిందని అన్నారు. మొదటిసారి ఇచ్చిన గడువు ముగియడంతో తిరిగి 03.09.2025న మరో 6 నెలలు గడువును పొడిగిస్తూ 2వ సారి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ గడువు ముగియకముందే అర్ధాంతరంగా పాలకవర్గాలను 19.12.2025 రద్దు చేసిందని అన్నారు.
పాలకవర్గాల పొడిగింపుపై హైకోర్టులో దావా వేయగా, పాలకవర్గాలను తిరిగి యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు తాము పర్సన్ ఇన్ చార్జీలుగా బాధ్యతలు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం, సహకార శాఖ కమిషనర్, జిల్లా సహకార అధికారి ఉత్తర్వులు జారీ చేశారన్నారు.. ఈ మేరకు సింగిల్ విండో కార్యాలయంలో సంఘ మానిటరింగ్ అధికారి కె.అనిల్ కుమార్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ సమక్షంలో పర్సన్ ఇన్ చార్జిగా కొత్త శ్రీనివాస్, డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. పర్సన్ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టడం ఆనందదాయకంగా ఉందని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, డైరెక్టర్లు అన్నారు.






