27 February, 2026 | 5:25 PM

Breaking News

ప్లాస్టిక్ నివారణపై శ్రీ సరస్వతీ విద్యాలయం ప్రదర్శన భేష్   •   చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో ఉపాధికై పోరాటం   •   మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి   •   పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ   •   మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి   •   రైతు భరోసాపై స్పష్టమైన ప్రకటన చేయాలి   •   రక్తదానం చేసి ప్రాణ రక్షకుడు యువకుడు   •   విబి బెంగుళూరు అయ్యంగార్ బేకరి, స్వీట్ హౌస్ ను ప్రారంభించిన శ్రీను బాబు   •   రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి   •  

కవితకు న్యాయం జరిగింది: కేటీఆర్ సంచలన ట్వీట్

27-02-2026 03:19 PM

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ కోర్టు తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఎక్స్ లో స్పందించారు. మద్యం స్కామ్ పేరుతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ప్రభుత్వాన్ని కూల్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇదే కథ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమైందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఉన్న కవితకు(K Kavitha) ఇవాళ న్యాయం జరిగిందని వెల్లడించారు. తమ లీడర్లపై నమోదైన ప్రతి కేసు రాజకీయా కక్షలో బాగమేనని పేర్కొన్నారు. నిజాలు బయటికి రానంతకాలం కాంగ్రెస్, బీజేపీ దుష్ప్రచారాలను చూస్తూనే ఉంటామని చెప్పారు. ఏదేమైనా చివరకు న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో(Delhi Excise Policy Caseఢిల్లీ కోర్టు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కె. కవితతో సహా మొత్తం 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. రద్దు చేయబడిన 2021–22 ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation) ప్రారంభించిన కేసును మూసివేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.