6 May, 2026 | 6:01 PM

కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నీడ కల్పించాలని ఇందిరమ్మ పథకం

06-05-2026 05:11 PM

బోథ్,(విజయక్రాంతి): పేద ప్రజలకు నిలువ నీడ కల్పించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు. బుధవారం సోనాల మండల కేంద్రంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించుకున్న ఇళ్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భవిష్యత్తులో అర్హులైన వారందరికీ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎల్ పోశెట్టి చౌహన్ సాయన్న భీమ్ రావు తదితరులు ఉన్నారు