5 August, 2026 | 2:58 AM

ఆ షోరూంలపై చర్యలు తీసుకోవాలి

05-08-2026 01:15 AM

మంత్రి పొన్నంకు వినతి 

ముషీరాబాద్,ఆగస్టు 4 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో సిఎన్జీ, ఎల్ఫీజీ  ఆటోరిక్షాలను తయారీ సంస్థ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న షోరూమ్ లపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిలభారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుద్రాక్ష మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ విషయంఫై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మంగళవారం ఆయన నివాసంలో యూనియన్ నేతలతో కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలిపారు.

అనంతరం బషీర్ బాగ్ లో అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సి.ఎన్.జీ ఎల్.పి.జీ ఆటోరిక్షాలను షోరూమ్‌నిర్వ హకులు  కంపెనీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న షోరూమ్ లపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరామని చెప్పారు. అన్ని షోరూమ్ లలో కంపెనీ నిర్ణయించిన ధరలు, ఇతర అధికారిక ఛార్జీల వివరాలను షోరూమ్ లలో ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో కెకెసి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కౌశల్ సమీర్, ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్, యూనియన్ జాయింట్ సెక్రటరీ శరత్, బి.  సత్యనారాయణ గౌడ్, బాలకోటి, ఫారుక్, నాగరాజు, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.