టీయూడబ్ల్యూజే (ఐజేయూ) బూర్గంపాడు మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కమిటీలకు కొత్త కార్యవర్గాల ఎంపిక
బూర్గంపాడు, ఆగస్టు4,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టి.యు.డబ్ల్యూజేఐజేయూ) బూర్గంపాడు మండల ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీలను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిధిలోని మొరంపల్లి బంజర్ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు జాగు వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించారు.
ప్రింట్ మీడియా కమిటీ
మండల అధ్యక్షుడిగా జక్కిరెడ్డి మల్లారెడ్డి (ఆంధ్రప్రభ), ప్రధాన కార్యదర్శిగా కోటా రమేష్ (ప్రజా ప్రతిభ), కోశాధికారిగా దానూరి శ్రీనివాస్ (నేటి దర్శిని) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పల్లంటి రమేష్ (తెలుగు ప్రభ), కేసుపాక రాజా (మన భద్రాద్రి), సహాయ కార్యదర్శులుగా చేతుల శ్రీనివాస్ (ప్రజాదర్బార్), గార్లపాటి శంకర్ (వేటూ న్యూస్) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మచ్చా సురేష్ (ప్రజా జ్యోతి), పల్లంటి హరీష్ (విజయక్రాంతి),ఎం.డి. ముజాఫర్ (విజన్ ఆంధ్ర) ఎంపికయ్యారు.
ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ
మండల అధ్యక్షుడిగా కుందూరు శ్రీనివాస్ రెడ్డి (6 టీవీ), కార్యదర్శిగా నుసుం సుబ్బారెడ్డి (మహా టీవీ), కోశాధికారిగా పోతిరెడ్డి వెంకటరామిరెడ్డి (సాక్షి టీవీ), గౌరవ అధ్యక్షుడిగా ఎన్. రమేష్ (ప్రజావాణి) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మూల వెంకట రమణారెడ్డి (రాజ్ న్యూస్), బి. రాజా (ఏబి న్యూస్), సహాయ కార్యదర్శులుగా మహేష్ రెడ్డి (ఐ న్యూస్), సుధాకర్ జి (ఎస్ న్యూస్), సహాయ కోశాధికారిగా బత్తుల రఘు (వీబీ న్యూస్) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఆదినారాయణ (డీఆర్డీ న్యూస్), పేరాల శ్రీనివాస్, వి. సందీప్ (ఫ్లాష్ న్యూస్9) ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీల సభ్యులను ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మైధిలి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేణుగోపాల్, జిల్లా అధ్యక్షుడు జాగు వెంకటరత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి జూనుముల రమేష్తో పాటు పలువురు జర్నలిస్టులు అభినందించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తి అభివృద్ధి కోసం నూతన కమిటీలు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి చీమకుర్తి శ్రీనివాసరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి నాగచంద్ర, జిల్లా కోశాధికారి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరు శ్రీహరి, డివిజన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.






