calender_icon.png 19 February, 2026 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

19-02-2026 02:39:51 AM

మేడ్చల్, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధి కారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం సిబ్బంది రాకముందే ఏసీబీ అధికారులు కార్యాలయానికి చేరుకొని వివిధ డిపార్ట్మెంట్లలో సోదాలు చేశారు. సర్కిల్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు జోరుగా జరుగుతున్నాయని ఇటీవల ఏసీబీ అధికారులకు ఫిర్యాదుల అందాయి.దీంతో ఏసీబీ అధికారు పథకం ప్రకారం రాత్రి వర కు సోదా చేశారు.

ఈ సందర్భంగా ఏసీబీ, డి.ఎస్.పి గంగసాని శ్రీధర్ మాట్లాడుతూ దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో అవినీతి జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో ఆకస్మికంగా తనిఖీ చేశామన్నారు. కొన్ని లోపా లు గుర్తించామని తెలిపారు. సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యా రని, శానిటేషన్ సిబ్బంది కూడా రికార్డుల సంఖ్య ప్రకారం విధులు నిర్వహించడం లేదని, తక్కువమంది డ్యూటీలో ఉన్నారని తెలిపారు. టౌన్ ప్లానింగ్‌లో నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోలేదని, దీనిపై విచారిస్తున్నామని తెలిపారు.