28 July, 2026 | 1:47 AM

అబ్దుల్ కలాం ఆశయాలు యువతకు స్ఫూర్తి

28-07-2026 12:06 AM

మేడ్చల్  జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్

ఘట్ కేసర్, జూలై 27 (విజయక్రాంతి) : భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను సోమవారం ఏదులాబాద్ డివిజన్ పరిధిలోని ఘనపూర్ లో ఘనంగా నిర్వహించా రు.  డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామల అమర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ స్థానిక నా యకులతో  కలిసి అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు.

ఈసందర్భంగా మహేష్ గౌడ్  మాట్లాడుతూ అబ్దుల్ కలాం  దేశాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత శాస్త్రవేత్త అని కొనియాడారు. భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్ర మంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశ్వనాధం, సత్తయ్య గౌడ్, పరమేష్ గౌడ్, ఉదయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ కమిటి గ్రామ అధ్యక్షులు రాజు గౌడ్, నర్సింహా, రమేష్, శంకర్ గౌడ్, సురేష్ నాయక్, అనిత, లత రెడ్డి, జంగారెడ్డి, రమేష్ పాల్గొన్నారు.