ప్రభుత్వ భూముల కబ్జాను అడ్డుకోండి..
కలెక్టర్‌కు కౌన్సిలర్ల ఫిర్యాదు
తాండూరు, జూలై 27, (విజయక్రాంతి) వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించాలని తాండూర్ మున్సిపల్ బిజెపి పార్టీ కౌన్సిలర్లు నాగారం మల్లేశం, అంతారం కిరణ్ కుమార్, శ్రీకాంత్ సోమవారం కలెక్టర్ దీపక్ తివారికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిసర్వే నంబర్130, విజయ విద్యాలయ పాఠశాల సమీపంలో ఉన్నప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 111, లలో కొందరు అక్రమార్కులు యదేచ్ఛగా కబ్జాలు చేసి నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
మరోవైపు వినాయక చౌక్ సమీపంలో ఉన్న అవేక్యూ ప్రాపర్టీని సైతం కొందరు అక్రమార్కులు అధికార పార్టీ కి చెందిన కొందరు నాయకులతో కలిసి ఏదోచ్ఛగా కబ్జాకు పాల్పడుతున్నారని వారిచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కలెక్టర్ వెంటనే స్పందించి అడ్డుకోవాలని వారు కోరారు.






