calender_icon.png 9 February, 2026 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొలాల్లో కూలిన శిక్షణ విమానం

09-02-2026 02:04:53 AM

కెప్టెన్, ట్రైనీ పైలట్‌కు గాయాలు

బెంగళూరు, ఫిబ్రవరి 8:  కర్ణాటకలో ఆదివారం ఓ ప్రైవేట్ శిక్షణ విమానం కుప్పకూలిం ది. విజయపుర జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్త డంతో విమానం పొలాల్లో క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో కెప్టెన్, ట్రైనీ పైలట్ గాయపడ్డారు.  రెడ్ బర్డ్ ఏవియేషన్‌కు చెందిన తేలిక పాటి శిక్షణ విమానం కలబురగి నుంచి బెలగావికి బయలుదేరింది. మార్గమధ్యంలో విజ యపుర జిల్లా పరిధిలోని మంగళూరు సమీపంలోకి రాగానే ఇంజిన్‌లో సమస్య తలెత్తింది.

దీంతో పైలెట్లు విమానాన్ని పొలాల్లో అత్యవసరంగా దించే ప్రయత్నం చేయగా, అది అదు పుతప్పింది.  ఆ సమయంలో విమానంలో కెప్టెన్, ట్రైనీ పైలట్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. దీంతో  వారు విమానం కూలిపోవడానికి ముందే కెప్టెన్, ట్రైనీ పైలట్ దూకేయడంతో గాయపడ్డారు. సమాచారం అందుకున్న బాబలేశ్వర్ పోలీసులు క్షతగాత్రులను  సమీప ఆసుపత్రికి తరలించారు.