8 July, 2026 | 10:04 AM

గ్యాస్ సిలిండర్ పెలి ఇల్లు పూర్తిగా దగ్ధం

08-07-2026 09:00 AM

బెజ్జూర్:(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి(Gas cylinder exploded) ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఎస్సై సర్తాజ్ పాషా, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్రం మహేష్,ప్రశాంత్ కుటుంబ సభ్యులు గ్యాస్ స్టవ్ పై ఇంట్లో వంట చేసుకుని భోజనం చేసిన అనంతరం పొలం పనులకు వెళ్లారు. వెళ్లిన కొద్దిసేపటికి ఇంట్లో నుండి ఒక్కసారిగా పెద్ద శబ్దం, మంటలు చెలరేగి కనిపించాయి ఇది చూసిన స్థానికులు వెంటనే ఎస్సై సర్తాజ్ పాషా కు సమాచారం అందించడంతో వెంటనే సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు.

మంటలు ఎగిసిపడడంతో స్వయంగా ఎస్సై స్థానిక ప్రజల సహకారంతో మంటలు అదుపు తెచ్చేందుకు నీటి బిందెలతో మంటలపై నీరు పోశారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను పూర్తిగా ఆర్పీ వేసింది దీనితో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో ఇంట్లోని 40 వేల నగదు,2 బీరువాలు, గ్యాస్, గ్యాస్ పొయ్యి, బంగారం, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి, ఇంటర్ మెమో ఇంట్లో సామాగ్రి సైతం పూర్తిగా కాలిపోయింది. ఘటన స్థలాన్ని తహసిల్దార్ రామ్మోహన్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి పరిశీలించి పంచనామ నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. భారీగా ఆస్తి నష్టం జరగడంతో కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు.

 ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన క్లూస్ టీం 

గ్యాస్ సిలిండర్ పేలిన స్థలాన్ని, సంఘటన స్థలాన్ని పరిశీలించి గ్యాస్ సిలిండర్ను స్వాధీన పరుస్తున్నారు. సంఘటన ప్రదేశం కు సర్పంచ్ మల్లేష్, నాయకులు భూష శంకర్, బాలకృష్ణ తదితరులు వెల్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.