8 July, 2026 | 9:38 AM

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

08-07-2026 09:01 AM

ఆశ అంగన్వాడి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి డాక్టర్ రాజశేఖర్ 

వీపనగండ్ల: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జులై 13న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు సమన్వయంతో పనిచేయాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ సూచించారు మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రతి ఆర్హులైన చిన్నారికి నులిపురుగుల నివారణ మాత్రలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు.

అనంతరం ఆశ డే సందర్భంగా ఆశ కార్యకర్తల సేవలను అభినందించిన ఆయన మాత శిశు సంరక్షణ గర్భిణీల నమోదు సంస్థగత ప్రసవాలు 100 శాతం టీకాల పూర్తిచేసేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలన్నారు.కుటుంబ నియంత్రణ క్షయవ్యాధి నియంత్రణ దీర్ఘకాలిక వ్యాధులు అంటూ వ్యాధులు పర్యవేక్షణ తదితర ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు గర్భిణీల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు డా. శ్వేత డా. కరణ్ డా. భాగ్యశ్రీ డా. కవిత డా మౌనిక కలమ్మ ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.