28 July, 2026 | 1:47 AM

కన్నుల పండువగా విశ్వశాంతి మహాయాగం

28-07-2026 12:52 AM

హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి దంపతులు

కల్వకుర్తి జులై 27: పట్టణంలో ఈ నెల 16 నుంచి నిర్వహిస్తున్న 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సోమవారం ఆధ్యాత్మిక వైభవంతో, కన్నుల పండుగగా కొనసాగింది. ఉదయం 6 గంటల నుంచి రుద్రసహిత మృత్యుంజయ, పశుపతాస్త్ర, చంద్రగ్రహ హోమాలను వేదపండితులు వైదిక మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. నిరంతరాయంగా జరుగుతున్న హోమాలు, ప్రత్యేక పూజలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

యాగశాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, ప్రతిరోజూ ఐదు నుంచి పది వేల మందికి పై గా భక్తులు పాల్గొని పూజల్లో భాగస్వాములవుతున్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎ మ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తన సతీమణితో కలిసి హోమంలో పాల్గొని ప్రత్యేక పూ జలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానంద స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గు వ్వల బాలరాజు పలువురు నాయకులు మ హాయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నప్ర సాదం తదితర సౌకర్యాలను కల్పిస్తూ మహాయాగాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.