28 July, 2026 | 1:19 AM

దేవాదుల రిజర్వాయర్ నీరు విడుదల

28-07-2026 12:52 AM

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, కాంగ్రెస్ నేతలు

భీమదేవరపల్లి, జూలై 27 (విజయక్రాం తి) : వర్షాభావంతో ఎండిపోతున్న పంటలకు దేవాదుల ద్వారా సాగునీటిని రైతులకు అందించడంతో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు చెందిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మం డలాలకు చెందిన రైతులు వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి, వరి పంటలు వేస్తున్నారు. వర్షాలు సక్రమంగా పడకపోవడంతో రైతన్న లు ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ నీటిపారుదల శాఖ అధికారులు సీఈ సుధీర్, ఎస్‌ఈ రాంప్రసాదులకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆదేశించారు.దీంతో రెండు మండలాల రైతులు పంట పొలాలకు సాగు నీరు అంది తమ పంటలు ఎండిపోకుండా ఉంటాయని సంతోషం వ్యక్తం చేశారు. సా గునీటిని విడుదల చేసిన వారిలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో చెందిన ప్రజా ప్రతినిధులు ముల్కనూర్ సర్పంచ్ జాలి   ప్రమోద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోచంపల్లి రాజిరెడ్డి, ఊస కోయిల ప్ర కాష్, బ్యాంకు ఉపాధ్యక్షులు గజ్జి వీరయ్య, జక్కుల అనిల్, మీస మహేష్, పోగుల శ్రీకాంత్ తదితరులున్నారు.