11 March, 2026 | 6:25 PM

టెహ్రాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడులు.. చమురు కర్మాగారాలు ధ్వంసం

12-03-2026 12:00 AM
  1. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా క్షిపణి దాడులు
  2. చమురు శుద్ధి కర్మాగారాలు, నిల్వ కేంద్రాలు ధ్వంసం
  3. గురవారం మేం శత్రుస్థావరాలపై దాడులు చేస్తాం: ఇరాన్ సైన్యం

టెహ్రాన్, మార్చి 10: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు మంగళవారం తెల్ల వారుజాము నుంచే ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా విరుచుకుపడ్డాయి. గడిచిన పది రోజుల్లో ఎన్నడూ లేని విధంగా అత్యంత శక్తిమవంతమైన క్షిపణులను ప్ర యోగించాయి. నగర చుట్టుపక్కల ఉన్న చమురు శుద్ధి కర్మాగారాలు, నిల్వ కేంద్రాలే లక్ష్యంగా దాడులు సాగాయి. దాడుల కారణంగా నగరం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. తమకు భారీ శబ్దాలు వినిపించాయని, పేలుళ్ల ధాటికి ఇళ్లు కంపిం చాయని స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్ ఆర్థిక వెన్నెముకను విరిచేందుకే ఈ దాడులు చేసినట్లు అమెరికన్ వర్గాలు స్పష్టం చేశాయి. కరాజ్, టబ్రీజ్, కిష్ ప్రాంతాల్లోనూ దాడులు సంభవించాయి.దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ‘ఇరాన్ శక్తిని మేం సున్నా చేశాం. ఇది ఇరాన్ విముక్తి కోసం మేం చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే. యుద్ధం ఇక ముగిసినట్లే’ అని ప్రకటించారు. ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు స్పందిస్తూ.. ‘విజయానికి మేం చాలా దగ్గరగా ఉన్నాం. ఇరాన్ యంత్రాం గం కూలిపోయే వరకు మేం విశ్రమించం’ అని ప్రకటించారు. మరోవైపు, అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా శత్రువుల కీలక స్థావరాలపై భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించింది.