9 May, 2026 | 6:48 PM

Breaking News

ధాన్యం అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి   •   పూసాలలో భక్తి పారవశ్యంతో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర   •   సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన బిజెపి నాయకులు   •   కారులో గ్యాస్ నింపుతుండగా పేలిన సిలిండర్   •   ఇండ్ల గణనకు ప్రజలు సహకరించాలి: తాసిల్దార్ శివప్రసాద్ పిలుపు   •   చిన్న కాంట్రాక్టర్ల పొట్టకొట్టే కుట్ర..!   •   తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్.. విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్   •   అగ్ని ప్రమాద బాధితులకు సరుకుల పంపిణీ   •   మక్కల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   మొక్కజొన్నను సత్వరమే రవాణా చర్యలు చేపట్టాలి   •  

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీబీగూడెంలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్

09-02-2026 12:00 AM

చివ్వెంల, ఫిబ్రవరి 8 : ఈ నెల 11వ తేదీన సూర్యాపేట మున్సిపాలిటీలకు జరగనున్న రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్.పి ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణలో భాగంగా మున్సిపాలిటీ కేంద్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ క్రమంలో చివ్వెంల మండల పరిధిలోని బీబీగూడెం గ్రామంలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడంలో పోలీస్ శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.ఈ ఫ్లాగ్ మార్చ్లో సూర్యాపేట రూరల్ సి.ఐ జి. రాజశేఖర్, చివ్వెంల యస్.ఐ వి. మహేశ్వర్, సర్కిల్ పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పాల్గొన్నారు.