కారులో గ్యాస్ నింపుతుండగా పేలిన సిలిండర్
మూడు కార్లు, బైక్ దగ్ధం
భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టిన స్థానికులు
కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో ఘటన
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో నీ దేవుని పల్లి లో శనివారం సిఎన్జి కారులో గ్యాస్ నింపుతుండగా పేలుడు సంభవించింది. దీంతో మూడు కార్లు, ఒక బైక్ దగ్దమైన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. దేవునిపల్లిలో ఒక కారులో ఎల్పిజి గ్యాస్ నింపుతుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఓకే సారీ పేలుడు సంభవించడంతో స్థానికులు ఆందోళనకు గురై పరుగులు తీశారు.
ఒకవైపు మంటలు మరోవైపు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. స్థానికులు అగ్ని మాపక శాఖ అధికారుల కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని ఎంతో శ్రమించి మంటలను ఆర్పి వేశారు. సిఎన్జి గ్యాస్ కారులో గ్యాస్ నింపుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులోని గ్యాస్ సిలిండర్ వెళ్లడంతో పక్కనే ఉన్న రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్ దగ్ధమైంది. సంఘటన స్థలాన్ని అగ్నిమాపక శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సందర్శించారు.






