తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్.. విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్
చెన్నై: తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే పార్టీ మద్దుతు తెలిపింది. దీంతో మూడ్రోజులుగా ఉత్కంఠ రేపిన తమిళ రాజకీయాలకు తెరపడింది. టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికే కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్ పార్టీలు మద్దతు తెలిపాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది.
టీవీకే అధినేత రెండు చోట్ల విజయం సాధించడంతో విజయ్ మెజార్టీ 107కు తగ్గింది. కాంగ్రెస్(5), సీపీఐ(2),సీపీఎం(2), ఐయూఎంఎల్(2) పార్టీలు ఇవ్వడంతో టీవీకే బలం 120కి చేరింది. రెండు స్థానాల్లో విజయం సాధించిన వీసీకే విజయ్ కు సపోర్ట్ చేయడంతో టీవీకే బలం 118కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ ఇప్పటికే మూడు సార్లు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ను కోరారు.
టీవీకే విజయ్ పార్టీకి వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా వీసీకే అధినేత తిరుమావళవన్ మాట్లాడుతూ... తమిళనాడులో రాష్ట్రపతి పాలన కోరుకోవడం లేదని, 108 స్థానాల్లో విజయం సాధించిన విజయ్ పార్టీక బేషరతుగా మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. విజయ్ కు గవర్నర్ అపాయింట్ మెంట్ తిరస్కరించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ ఏర్పాటు కు విజయ్ ను కచ్చితంగా ఆహ్వానించాలన్నారు.






