9 May, 2026 | 5:34 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

పత్రికలు దిక్సూచి కావాలి

09-02-2026 12:00 AM

సర్పంచి బొల్లెపల్లిరామనాథం గౌడ్

గరిడేపల్లి, ఫిబ్రవరి 8 : పత్రికలు ప్రజాస్వామ్యానికి దిక్సూచి కావాలని కీతవారి గూడెం గ్రామ సర్పంచి బొల్లెపల్లి రామనాథం గౌడ్ అన్నారు.ఆదివారం మండలం లోని కీతవారిగూడెం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గరిడేపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండ సైదులు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎల్లావుల వెంకటేష్ యాదవ్ లకు పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల పాత్ర ఎంతో కీలకమైందని,ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసు కువచ్చే బాధ్యత పాత్రికేయులదేనని అన్నారు.ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచి నిజమైన సమాచారంతో ప్రజలను చైతన్యవంతుల్ని చేయడమే పత్రికల లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దాసరి శ్రీనివాస్ యాదవ్, హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పెడమర్తి అంజి,బి.ఆర్.ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన నాయకులు కీత పరుశురాం,షేక్ సైదా హుస్సేన్,నర్సింగ్ వెంకన్న,నర్సింగ్ కాశయ్య,పోలంపల్లి సైదులు, గుండు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.