11 April, 2026 | 4:28 AM

చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని..

11-04-2026 02:32 AM

తూప్రాన్, ఏప్రిల్ 10: శుక్రవారం జరుగుచున్న పెళ్లి విందులో చికెన్ లెగ్ పీస్ అమాంతం తినే ప్రయత్నంలో గొంతులో ఇరుక్కుని ఊపిరాడగా ప్రాణాలు గుపిట్లు పెట్టుకొని కొట్టు మిట్టాడుతున్న మల్లయ్య 65 హకీంపేట్ వృద్ధుడిని తూప్రాన్ ప్రభుత్వ దావఖానకు తీసుకొని రావడం జరిగింది.

ఇందుకు గాను హాస్పటల్ సుపీరియడెంట్ డాక్టర్ అమీర్ సింగ్ మరియు వైద్య సిబ్బంది చికిత్స లో భాగమైన హేమ్లిక్ పద్ధతిని ఉపయోగించి గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్కను తొలగించి వృద్ధుడిని కాపాడి కావలసిన మందులను ఇవ్వడం జరిగింది. కాస్త పది నిమిషాలు ఆలస్యం అయితే వృద్ధుడి ప్రాణాలు కోల్పోయేవాడని తెలిపిన వైద్యుడు. ఈ సందర్భంగా కుటుంబీకులు సమీప బంధువులు డాక్టర్ అమీర్ సింగ్ మరియు వైద్య సిబ్బంది చేసిన వైద్యానికి గాను ప్రశంసించారు.