16 March, 2026 | 10:03 AM

ముస్లింల అభ్యున్నతికి పెద్దపీట

16-03-2026 12:00 AM

* ఎమ్మెల్యే జిఎంఆర్ 

* పటాన్చెరులో ముస్లింలకు ఈద్ తోఫాల పంపిణీ

పటాన్చెరు, మార్చి 15 : పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ మసీదుల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించిన రంజాన్ కానుకలను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముస్లింల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. రంజాన్ పండుగ రోజున నిరుపేద ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య పండుగను నిర్వహించుకోవాలన్న లక్ష్యంతోనే గతంలో కెసిఆర్ ప్రభుత్వం రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ముస్లిం మత పెద్దలు లియాకత్ అలీ, అజ్మత్, మొయిన్, నర్రా బిక్షపతి, వెంకటేష్, ఇమ్రాన్, నాయకులు పాల్గొన్నారు.