మొబైల్ యాప్ రైతుల పాలిట శాపం
- అఖిల భారత రైతుకూలి సంఘం
టేకులపల్లి,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్ యాప్ ద్వారా ఎరువుల కొనుగోలు రైతుల పాలిట శాపంగా మారిందని అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి భూక్య హర్జ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి ఎట్టి నరసింహారావు అన్నారు. మండలంలోని తుమ్మలచలక, లక్ష్మిపురం, బోడు కొత్తగూడెం గ్రామాలలో సంఘం ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... మొబైల్ యాప్ ద్వారా యూరియా కట్టలను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని విరమించుకోవాలని పెంచిన ఎరువు కట్టల ధరలను తగ్గించాలని రైతుల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్న డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29న టేకులపల్లి తహసిల్దారు కార్యాలయం ముందు జరుగు ధర్నాకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మొబైల్ యాప్ రద్దు అయ్యేంత వరకు రైతులు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.






