25 June, 2026 | 3:01 AM

ప్రభుత్వ ఉపాధ్యాయురాలి దాతృత్వం

25-06-2026 01:54 AM

విద్యార్థులకు రూ.5 వేలతో విద్యాసామాగ్రి అందజేత 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూన్ 24: మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్య నభ్యసిస్తున్న విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ స్థలదాత మోర ఆనంద నాగారం మండలంలోని పాటిమీదిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలపై ఉన్న మమకారంతో, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బుధవారం రూ.5 వేలతో పాఠశాలలో చదివే విద్యార్థులకు నోటుబుక్స్, పెన్నులు, పెన్సిల్లతో పాటు మరికొన్ని వస్తువులను గ్రామ సర్పంచ్ కర్నాటి వెంకన్న, మండల విద్యాధికారి బాలునాయక్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు.

అనంతరం పాఠశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మునుముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు తన సొంత ఖర్చులతో నోట్ పుస్తకాలను అందజేసిన ఉపాధ్యాయురాలు ఆనందను అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం నీరజ,సహోపాధ్యాయులు నల్లగంటి వెంకన్న, గ్రామస్తులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.