వర్షం కోసం.. గంగ నీళ్ల పండుగ
29-06-2026 12:13 AM
గోదావరి జలాలతో విగ్రహాలకు జలాభిషేకం
నిర్మల్, జూన్ 28 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాకుపట్ల గ్రామంలో ఆదివారం వర్షాలు కురవాలని రైతులు గంగ నీళ్ల పండుగ నిర్వహించారు. గ్రామంలోని రైతులు ప్రజలు సమీపంలో ఉన్న గోదావరి నదికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గోదారమ్మ కరుణించి వర్షాలు కురవాలని వేడుకుంటూ నీటి కుండలో నీళ్లను తీసుకొచ్చి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. పోతురాజుల వేషాలు డబ్బు సప్పులు మధ్య ఈ పండుగ నిర్వహిస్తే వానదేవుడు కరుణించి వర్షాలు కురుస్తాయని ఈ పండుగ ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పెద్దలు పాల్గొన్నారు.






