శ్మశానవాటిక అభివృద్ధిని అడ్డుకుంటే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం
- అక్రమ నిర్మాణాల వద్ద ఆందోళన నిర్వహిస్తా
- టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డి, మే 25 (విజయక్రాంతి): కామారెడ్డిలో స్మశానవాటిక అభివృద్ధికి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకట రమణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ లు అడ్డుపడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రె స్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి అభివృద్ధికి కృషి చేయా ల్సిన నాయకులు అడ్డుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు.
కామారెడ్డి పట్టణ అభివృద్ధిని అడ్డుకుంటే సదర్ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిస్తామన్నారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ఇండ్ల వద్ద ధర్నా చేస్తానన్నారు. కామారెడ్డి పట్టణ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేంకట రమణా రెడ్డి సమావేశం నిర్వహించారు ఆ సమావేశం వెనుక అంతర్యం ఏమి టి అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసి రివ్యూ మీటింగ్ పెడితే బాగుంటుండే దన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఒక ఆరు ఎకరాల ఒక వెంచర్ కు ఛార్జీ తీసుకున్న 3 రోజులకే కమిషనర్ అనుమతులు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వెంచర్ కి అనుమతులు అంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నారు. అనుమతులు ఇప్పించి వారితో స్వలాభం పొంది ప్రభుత్వ స్కూళ్లకు బెంచీలు పంపిణీ చేశారని ఆరోపించారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ సలహాదారుగా, ఎమ్మెల్యేగా ఉన్నవారు హిందూ శ్మశాన వాటికలో అభివృద్ధికి అడ్డుపడుతున్నారు.
పది రోజుల్లో జిల్లా కలెక్టర్ ను కలిసి శ్మశాన వాటిక అభివృద్ధికి అనుమతి ఇవ్వాలని కోరబోతున్న అందుకు మిగతా నాయకులు కలిసి రావాలి, లేదంటే అన్ని కుల సంఘాల నాయకులతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అక్రమ కట్టడాలను అడ్డుకునే స్థితిలో కామారెడ్డి అధికారులు, ప్రజా ప్రతినిధులు లేరు. వారం రోజుల్లో పట్టణంలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చకపోతే ఆ కట్టడాల వద్దనే మీడియా సమావేశం పెట్టాల్సి వస్తదని అన్నారు.
ఎన్నికల సమయంలో తప్ప గ్రామాలవైపు ఎమ్మెల్యే వెళ్లిన దాఖలాలు లేవు అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పిడుగు మమత సాయిబాబు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్, గడ్డమీది మహేష్, తాటి ప్రసాద్ లావణ్య, క్రెడా అధ్యక్షులు నర్సాగౌడ్,మాజీ కౌన్సిలర్లు, సలీం,చాట్ల వంశీ, రంగ రమేష్ గౌడ్, కామారెడ్డి సేవాదళ్ యూత్ అధ్యక్షులు, నర్సుల మహేష్, బల్ల శ్రీనివాస్, మెహర్ బాబా గౌడ్, అరుణ్, రాహుల్, శశి, ఆకాష్. ఉన్నారు.






