సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
06-08-2026 01:27 AM
ఏసీపీ కాశిరెడ్డి
రంగారెడ్డి, ఆగస్టు 5 (విజయక్రాంతి):ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి సూచించారు. ‘సైబర్ జాగూరుకత‘ కార్యక్రమంలో భాగంగా బుధవారం పార్కుల్లో ప్రజలకు, కృష్ణవేణి కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు.ఆన్లైన్ ఉద్యోగాలు, పెట్టుబడులు, ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు.అపరిచితులకు బ్యాంక్ వివరాలు, ఓటీపీలు చెప్పవద్దని... మోసపోతే వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్ను సంప్రదించాలని స్పష్టం చేశారు.






