పీర్జాదిగూడ మెయిన్ రోడ్డు ప్యాచ్‌వర్క్ పూర్తి
06-08-2026 01:24 AM
మేడిపల్లి, ఆగస్టు 5 (విజయక్రాంతి); మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్, 10వ డివిజన్ పరిధిలోని పిర్జాదిగూడ మెయిన్ రోడ్డుపై పడిన గుంతలను మున్సిపల్ సిబ్బంది పూర్తి వేశారు. మెయిన్ రోడ్డు ప్యాచ్ వర్క్ సమస్యను స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీరాములు గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో, అధికారులు ఒక్క రోజులోనే ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా బండి శ్రీరాములు గౌడ్ స్పష్టం చేశారు.






